Vijayanagaram District: భర్తను చంపించిన సరస్వతి ప్రియుడు శివ మామూలోడు కాదంటున్న పోలీసులు!

  • వారం ముందే పార్వతీపురంలో మకాం
  • హత్యకు కొద్దిసేపటి ముందు అనకాపల్లి వెళ్లిపోయిన శివ
  • సరస్వతికన్నా ముందే మరో యువతితో ప్రేమాయణం

విజయనగరం జిల్లాలో కలకలం రేపిన భర్తను హత్య చేయించిన సరస్వతి కేసులో, ఆమె ప్రియుడు శివను అరెస్ట్ చేసి విచారించిన పోలీసులు అతను మామూలోడు కాదని అంటున్నారు. సరస్వతి కన్నా ముందు మరో అమ్మాయిని ప్రేమించిన శివ, ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించాడని, ఆ యువతిని ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రులకు పరిచయం కూడా చేశాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆ సమయంలో తల్లిదండ్రులు మందలించడంతో వెనక్కు తగ్గిన శివ, ఆమెను వదిలేశాడని, ఆ తరువాత సరస్వతి పరిచయం అయిందని చెప్పారు.

ఇక సరస్వతి భర్త గౌరీ శంకర్ ను హత్య చేయాలని ప్లాన్ చేసిన తరువాత, వారం రోజుల ముందే పార్వతీపురానికి వచ్చేశాడని, ఓ పెళ్లికి వెళుతున్నట్టు ఇంట్లో చెప్పి వచ్చాడని చెప్పారు. మరికాసేపట్లో గౌరీశంకర్ ను ట్రాప్ చేసి హత్య చేస్తారనగా, పార్వతీపురం నుంచి అనకాపల్లికి శివ వెళ్లిపోయాడని తెలిపారు. సరస్వతి చెప్పిన ప్లాన్ ప్రకారం, హత్యకు అవసరమైన డబ్బు సర్దేందుకు, నేర చరిత్ర ఉన్నవారితో మాట్లాడే బాధ్యతను శివ తీసుకున్నాడని తెలిపారు. ఓ పక్కా ప్లాన్ ప్రకారమే శివ, సరస్వతి కలసి గౌరీ శంకర్ ను చంపించారని, తమకు రోడ్డుపై ఆటోలో వెళుతున్న నిందితులు తారసపడి ఉండకపోతే, కేసు చిక్కుముడి అంత త్వరగా వీడేది కాదని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

Vijayanagaram District
Saraswati
Siva
Murder
  • Loading...

More Telugu News