Prakash Raj: బీటెక్ లో బోలెడు బ్యాక్ లాగ్స్.. తల్లిదండ్రులు మందలించలేదని మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య!

  • ప్రకాశం జిల్లా తాళ్లూరులో ఘటన
  • తొమ్మిది సబ్జెక్టుల్లో తప్పినా మందలించలేదని మనస్తాపం
  • పురుగుల మందు తాగి ఆత్మహత్య

బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని, తాను పరీక్షలు తప్పినా తల్లిదండ్రులు ఏమీ అనలేదన్న కారణంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లా తాళ్లూరులో కలకలం రేపింది. మాజీ ఎంపీటీసీ సూరా సుబ్బులు మనవరాలు, వైకాపా నేత వెంకటరెడ్డి కుమార్తె గురులక్ష్మి తెనాలిలోని ఓ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది.

తొమ్మిది సబ్జెక్టుల్లో తప్పినప్పటికీ, ఆమెను ఎవరూ మందలించలేదు. తనను ఎవరూ మందలించకపోవడంతో మరింత బాధపడిన ఆమె, శుక్రవారం నాడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు ఒంగోలులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. విషయం తెలుసుకున్న పలువురు వైసీపీ నేతలు వెంకటరెడ్డిని పరామర్శించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు.

Prakash Raj
B-Tech
Sucide
Backlogs
  • Loading...

More Telugu News