New Delhi: 'ఇండిగో'కు గుణపాఠం చెప్పాలనుకుని చిక్కుల్లో పడ్డాడు!

  • సంస్థలో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ గా పని చేస్తున్న ఉద్యోగి
  • పనితీరు బాగాలేక పోవడంతో వార్నింగ్
  • పగ తీర్చుకోవాలని భావించి ఫేక్ బాంబ్ కాల్

దేశవాళీ ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగోకు గుణపాఠం చెప్పాలని భావించిన సంస్థ ఉద్యోగి ఒకరు చిక్కుల్లో పడ్డాడు. ముంబై ఎయిర్ పోర్టులో రెండు గంటల పాటు అలజడి రేపిన ఈ విషయమై మరిన్ని వివరాల్లోకి వెళితే, ఇండిగో ఎయిర్ లైన్స్ లో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ గా పని చేస్తున్న పుణెకు చెందిన 23 సంవత్సరాల కార్తీక్ మాధవ్ భట్ అనే ఉద్యోగి పనితీరు సరిగ్గాలేదని, మార్చుకోకుంటే ఉద్యోగాన్ని వీడాల్సి వుంటుందని యాజమాన్యం హెచ్చరించింది.

దీంతో ఆగ్రహానికి గురైన కార్తీక్, ఎయిర్ పోర్టు సెక్యూరిటీ సిబ్బందికి కాల్ చేసి ఇండిగో విమానంలో బాంబు ఉందని చెప్పాడు. ఆ వెంటనే అలెర్ట్ ప్రకటించిన సెక్యూరిటీ సిబ్బంది విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసి, తనిఖీలు చేపట్టారు. దాదాపు రెండు గంటల తరువాత బాంబు ఉందని వచ్చిన కాల్ తప్పుడుదని తేల్చారు. విచారణలో ఈ కాల్ చేసింది సంస్థ ఉద్యోగేనని తేల్చి అతన్ని అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News