manohar parrikar: కోలుకుంటున్న మనోహర్ పారికర్.. కర్ణాటక ఎన్నికలపై వాకబు

  • క్లోమ గ్రంధి సంబంధిత సమస్యతో బాధపడుతున్న పారికర్
  • రెండు నెలలుగా అమెరికాలో చికిత్స
  • ఫోన్‌లో మాట్లాడిన అమిత్ షా

క్లోమ గ్రంథికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ (62) ఆరోగ్యం కుదుటపడుతోంది. రెండు నెలలుగా అమెరికాలో చికిత్స తీసుకుంటున్న పారికర్ త్వరలోనే రాష్ట్రానికి వచ్చి పాలనా పగ్గాలు చేపడతానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు అమెరికా నుంచి ఆయన పంపిన సందేశాన్ని బీజేపీ చీఫ్ అమిత్ షా కార్యకర్తల సమావేశంలో వినిపించారు. పారికర్‌తో తాను ఫోన్‌లో మాట్లాడానని, కర్ణాటక ఎన్నికల గురించి ఆయన వాకబు చేశారని తెలిపారు. ఆయన అంకితభావం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నారు.

మరోవైపు, రెండు నెలలుగా ముఖ్యమంత్రి లేని గోవా పరిస్థితి తలలేని మొండెంలా ఉందని కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. పాలనను గాలికి వదిలేశారని పేర్కొంది. రాష్ట్రానికి పూర్తిస్థాయి ముఖ్యమంత్రిని అందించాలని, లేదంటే ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు గోవా తొలి ముఖ్యమంత్రి దయానంద్ బండార్కర్ మెమోరియల్ భవన్ ఎదుట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఆఫీస్ బేరర్లు ఆదివారం ఆందోళన నిర్వహించారు.

manohar parrikar
Goa
BJP
Amith shah
  • Loading...

More Telugu News