parwatipuram: సంచలనం సృష్టించిన సరస్వతి కేసులో మరో విస్తుపోయే నిజం వెల్లడి!

  • పెళ్లి అయిన పది రోజులకే భర్తను హత్య చేయించిన సరస్వతి
  • బెంగళూరు ముఠాతో హత్యకు ఒప్పందం
  • రూ.25 వేలు అడ్వాన్స్‌గా చెల్లింపు

వివాహమైన పది రోజులకే ప్రియుడితో కలిసి సొంత మేనబావ అయిన భర్తను దారుణంగా హత్య చేయించిన సరస్వతి హత్య కేసులో విస్తుపోయే మరో విషయం బయటపడింది. విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన సరస్వతి పెళ్లయిన పదో రోజే ఫేస్‌బుక్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేయించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. విజయనగరం ఎస్పీ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తన భర్త గౌరీ శంకర్‌ను హత్య చేయించడానికి నిందితురాలు బెంగళూరు ముఠాతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు.

ప్రియుడు శివతో కలిసి పెళ్లికి ముందే రూ.25 వేలు అడ్వాన్స్‌గా చెల్లించి హత్యకు కుట్ర పన్నినట్టు వివరించారు. ఈ సొమ్మును మొబైల్ యాప్ ద్వారా పంపారని తెలిపారు. ఒప్పందం చేసుకున్న ముఠా తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అప్పుడు విజయనగరానికి చెందిన మరో ముఠాతో డీల్ కుదుర్చుకున్నారని ఎస్పీ వివరించారు. కాగా, ఈ కేసులో సరస్వతి, ఆమె ప్రియుడు శివ సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

parwatipuram
Saraswathi
Lover
Murder
  • Loading...

More Telugu News