Tollywood: జీవితా రాజశేఖర్, బాబు గోగినేని, పవన్ ఫ్యాన్స్‌పై సినీ నటి శ్రీరెడ్డి ఫిర్యాదు

  • మొత్తం 28 మందిపై పోలీసులకు ఫిర్యాదు
  • సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం కొనసాగుతోందన్న నటి
  • సైబర్ క్రైం సహకారంతో కేసు నమోదు చేస్తామన్న ఏసీపీ

తెలుగు చిత్రసీమలో క్యాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న సినీ నటి శ్రీరెడ్డి మరోమారు వార్తల్లోకి ఎక్కింది. ప్రముఖ సినీ నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్, హేతువాది బాబు గోగినేని, పవన్ కల్యాణ్ అభిమానులు, పలువురు సినీ నటులు, ఆర్టిస్టులు సహా మొత్తం 28 మందిపై హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఫేస్‌బుక్‌లో తనపై దుష్ర్పచారం ఆగలేదని, కొందరు కావాలని, పనికట్టుకుని తనపై ఇటువంటి ప్రచారం చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఆదివారం హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆసిఫ్‌నగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తికి ఈ మేరకు వినతి పత్రం అందించింది. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. సైబర్ క్రైం సహకారంతో ఫిర్యాదులోని అంశాలపై వివరాలు సేకరించి, న్యాయ సలహా తీసుకుని కేసు నమోదు చేస్తామని శ్రీరెడ్డికి ఏసీపీ హామీ ఇచ్చారు.

Tollywood
Sri Reddy
jeevitha Rajsekhar
Pawan Kalyan
  • Loading...

More Telugu News