ambati: చంద్రబాబు గారూ! పట్టాల మీద కెక్కించింది పరిపాలనను కాదు, మీ అబ్బాయిని!: అంబటి రాంబాబు

  • పట్టాలమీద కెక్కించినా మీ అబ్బాయి ముందుకుసాగని పరిస్థితి!
  • అంబేద్కర్ ను ఓడించిన కాంగ్రెస్ పార్టీ వైసీపీలో ఉందన్నారు
  • ఆ కాంగ్రెస్ పార్టీ వైసీపీలో లేదు
  • ఎంత శాతం కాంగ్రెస్ రక్తం మీలో ప్రవహిస్తోందో చెప్పాలి?

ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘ ఏపీలో పరిపాలనను పట్టాలమీద కెక్కించానని చంద్రబాబునాయుడు గారు ఇటీవల ప్రకటించారు. పట్టాలమీద కెక్కించింది పరిపాలనను కాదు, మీ అబ్బాయిని! పట్టాలమీద కెక్కించినా మీ అబ్బాయి ముందుకుసాగని పరిస్థితి కనపడుతోంది.

అంతేకాకుండా, కాంగ్రెస్ పార్టీ గురించి చంద్రబాబునాయుడుగారు ఇటీవల మాట్లాడారు. అంబేద్కర్ ను ఓడించినటువంటి కాంగ్రెస్ పార్టీ వైసీపీలో ఉందని చంద్రబాబు అన్నారు. ఆ కాంగ్రెస్ పార్టీ వైసీపీలో లేదని మనవి చేస్తున్నా. చంద్రబాబునాయుడు గారూ! మీరే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారు, మంత్రిగా చేసిన వారు మీరు. కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి మీరు వచ్చినప్పుడు ఓ మాట చెప్పారు..‘నాలో డెబ్బై శాతం కాంగ్రెస్ రక్తం ప్రవహిస్తోంది’ అని. ఈరోజున, ఎంత శాతం కాంగ్రెస్ రక్తం మీలో ప్రవహిస్తోందో చెప్పాలని మనవి చేస్తున్నా!’ అని విమర్శించారు. 

  • Loading...

More Telugu News