Tamilnadu: రజనీకాంత్ తో నష్టం అన్నాడీఎంకేకే.. సర్కారుకు అందిన సీక్రెట్ రిపోర్ట్!

  • రజనీ రాజకీయాల్లోకి వస్తే డీఎంకేకు నష్టం స్వల్పమే
  • 150 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావం
  • అన్నాడీఎంకే ఓటు బ్యాంకు పోతుందన్న రిపోర్ట్

రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే, విపక్షంలోని డీఎంకేకన్నా అన్నాడీఎంకే పార్టీకే అధిక నష్టమని తమిళనాడు ప్రభుత్వానికి రహస్య నివేదిక అందినట్టు తెలుస్తోంది. ప్రముఖ తమిళ పత్రిక 'దినమలర్'లో నేడు ప్రచురితమైన వార్త వివరాల ప్రకారం, కనీసం 150 నియోజకవర్గాల్లో రజనీ ప్రభావం అధికంగా ఉంటుందని, అన్నాడీఎంకే ఓటు బ్యాంకునే ఆయన అధికంగా కొల్లగొట్టనున్నారని రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు తమ రిపోర్టును ప్రభుత్వానికి అందించాయి.

రజనీ ప్రభావం పడే నియోజకవర్గాల జాబితాను కూడా అధికారులు తయారు చేయగా, ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిని సారించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా దక్షిణ తమిళనాడు, చెన్నై, కంచి తదితర ఏరియాల్లో రజనీకి మంచి ఓట్ల శాతం రావచ్చని ఈ రిపోర్టు అంచనా వేసింది.

Tamilnadu
Rajanikant
AIADMK
DMK
  • Loading...

More Telugu News