Rishi Kapoor: సల్మాన్ మరదలు సీమాతో రిషి కపూర్ అసభ్య ప్రవర్తన... క్షమాపణలు చెప్పిన నీతూ కపూర్!

  • సోనమ్ వివాహ వేడుకలో ఘటన
  • సల్మాన్ పై ఆగ్రహంతో అసభ్యంగా ప్రవర్తించిన రిషి
  • మండిపడుతున్న నెటిజన్లు

తన వివాదాస్పద వైఖరితో బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. సల్మాన్ ఖాన్ మరదలు సీమా ఖాన్ తో రిషి కపూర్ అసభ్యకరంగా ప్రవర్తించగా, అందుకు రిషికపూర్ సతీమణి నీతూ కపూర్ క్షమాపణలు చెప్పినట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అనిల్ కపూర్ కుమార్తె సోనమ్‌ కపూర్ వివాహ విందు వేళ ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. విందుకు రిషికపూర్, తన భార్య నీతూ కపూర్‌ తో కలిసి హాజరయ్యారు. అదే పార్టీకి వచ్చిన సల్మాన్‌ తనతో సరిగ్గా మాట్లాడకుండా, ఇతర నటీనటులతో కలసి డ్యాన్సులు చేస్తున్నారన్న ఆగ్రహంతో రిషి ఇలా చేశారని తెలుస్తోంది.

ఇక తనకు జరిగిన అన్యాయం, ఎదురైన అనుభవంపై సీమా, సల్మాన్‌ కు ఫిర్యాదు చేయగా, ఆగ్రహానికి గురైన ఆయన, రిషితో మాట్లాడేందుకు వెళ్లేసరికే, వేడుక నుంచి రిషి కపూర్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇక తన భర్త చేసిన పని గురించి నీతూకు తెలియగా, ఆమె సీమా ఖాన్ వద్దకు వెళ్లి స్వయంగా క్షమాపణలు చెప్పారట. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో, సీనియర్‌ నటుడు అయివుండి మహిళల పట్ల ఇలాగేనా ప్రవర్తించేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Rishi Kapoor
Salman Khan
Sonam Kapoor
Anil Kapoor
Nitu Kapoor
Seema Khan
  • Loading...

More Telugu News