CRDA: నిర్మాణాలు చేబట్టని భూముల్ని తిరిగి ఇచ్చేయండి... కేంద్రానికి చంద్రబాబు సర్కారు నోటీసులు!

  • వివిధ సంస్థల కార్యాలయాల కోసం భూమి పొందిన కేంద్రం
  • మూడు నెలల్లో పనులు ప్రారంభించాలని నిబంధన
  • ఇంకా ప్రారంభం కాని నిర్మాణపు పనులు
  • సీఆర్డీయే నుంచి కేంద్రానికి నోటీసులు

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో కేంద్ర సంస్థల ఏర్పాటు నిమిత్తం తీసుకున్న భూమిలో పనులు ప్రారంభించని కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ, ఆ భూములను తిరిగి ఇచ్చేయాలంటూ సీఆర్డీయే కేంద్రానికి నోటీసులు పంపింది. అమరావతిలో సెంట్రల్ యూనివర్శిటీ, ఎస్బీఐ, ఎఫ్సీఐ, పోస్టల్, ఎల్ఐసీ కార్యాలయాల కోసం గతంలో భూములను తీసుకున్న కేంద్రం, వాటిలో ఎటువంటి నిర్మాణపు పనులనూ మొదలు పెట్టలేదు.

దీంతో సీఆర్డీయే అధికారులు కేంద్ర శాఖలకు నోటీసులు పంపారు. భూమి పొందిన తరువాత మూడు నెలలలోగా నిర్మాణాలను ప్రారంభించాల్సి వుంటుందని గుర్తు చేసిన మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ, సంవత్సరాలు గడిచినా పనులు చేపట్టలేదు కాబట్టే నోటీసులు ఇచ్చామని అన్నారు. ఏపీ సర్కారు నోటీసులపై కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సివుంది.

  • Loading...

More Telugu News