India: సొంతంగా తొలి వార్ షిప్ ను తయారు చేసి, వాటి చిత్రాలు విడుదల చేసిన చైనా

- 'లియానింగ్' చిత్రాలను విడుదల చేసిన చైనా
- 2020 నాటికి సైన్యానికి
- అమెరికా, రష్యా, బ్రిటన్, ఇండియాల సరసన చైనా
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తాను తయారు చేసుకున్న విమాన వాహక యుద్ధ నౌక 'లియానింగ్' చిత్రాలను చైనా విడుదల చేసింది. అధికార న్యూస్ ఏజన్సీ 'షిన్హువా' వెల్లడించిన వివరాల ప్రకారం, 'టైప్ 0001ఏ'లో దీన్ని తయారు చేయగా, సముద్రంలో ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. మరో రెండేళ్ల పాటు దీన్ని అన్ని విధాలుగా పరీక్షించి 2020 నాటికి సైన్యానికి అందిస్తామని అధికారులు వెల్లడించారు.
వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో దీన్ని మోహరించి, దేశాన్ని రక్షించుకోవాలన్నది చైనా అభిమతమని తెలుస్తోంది. ఇప్పటివరకూ విమాన వాహక యుద్ధ నౌకలను తయారు చేసే సత్తా అమెరికా, రష్యా, బ్రిటన్, ఇండియాలకు ఉండగా, వీటి సరసన చైనా వచ్చి చేరింది.
