AMAZON: ఫ్లిప్ కార్ట్, అమేజాన్ లలో నేటి నుంచే తగ్గింపు ధరలపై భారీ స్థాయిలో అమ్మకాలు
- ఫ్లిప్ కార్ట్ లో మొబైల్స్ పై భారీ ఆఫర్లు
- హెచ్ డీఎఫ్ సీ కార్డులపై 10 శాతం తగ్గింపు
- అమేజాన్ డాట్ ఇన్ లో ఐసీఐసీఐ కార్డులపై 10 శాతం తగ్గింపు
- 16వ తేదీ వరకు కొనసాగనున్న ఆఫర్లు
అమేజాన్ ఇండియా, ఫ్లిప్ కార్ట్ సంస్థలు తమ ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ లపై నేటి నుంచి నాలుగు రోజుల పాటు (ఈ నెల 13-16 వరకు) తగ్గింపు ధరలపై అమ్మకాలు మొదలు పెట్టాయి. ఏటా వేసవిలో ఈ రెండు సంస్థలు గ్రాండ్ సేల్స్ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నాయి. ఈ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ సంస్థ మొబైల్స్, గ్యాడ్జెట్ లపై భారీ ఆఫర్లను తీసుకొచ్చింది.
ఆనర్ 9 లైట్, ఆనర్ 9ఐ, రెడ్ మీ నోట్ 5, మోటో ఈ4 ప్లస్, వివో వి7ప్లస్, ఒప్పో ఎఫ్3ప్లస్, శామ్ సంగ్ మొబైల్స్, గూగుల్ పిక్సెల్ 2, 2ఎక్స్ఎల్, ఒప్పో 83, ఒప్పో ఎఫ్7, రెడ్ మీ 5ఏ, రెడ్ మీ నోట్ 5ప్రో మోడల్స్ పై ధరల్ని తగ్గించి అమ్ముతోంది. హెచ్ డీఎఫ్ సీ క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనేవారికి కొనుగోలు ధరలో 10 శాతాన్ని తగ్గిస్తోంది. కనీసం రూ.4,999 కొంటేనే ఈ తగ్గింపు లభిస్తుంది. గరిష్టంగా రూ.1,500 వరకే. దీనికి తోడు బజాజ్ ఫైనాన్స్ నుంచి వడ్డీ లేని ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తోంది.
అమేజాన్ ఇండియా సమ్మర్ సేల్ పేరుతో నిర్వహిస్తున్న విక్రయాల్లో తగ్గింపు నామమాత్రంగానే కనిపిస్తోంది. మొబైల్స్ పై స్వల్ప తగ్గింపు ధరలే కనిపిస్తున్నాయి. కాకపోతే ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం కనీస కొనుగోలు రూ.3,000 తక్కువ కాకుండా ఉండాలి. గరిష్ట తగ్గింపు రూ.1,500కే పరిమితం. ఒకవేళ అమేజాన్ పేలోకి లోడ్ చేసుకుని కొనుగోలు చేసుకుంటే కనీస కొనుగోలు రూ.250 ఉంటే 10 శాతం తగ్గింపు (గరిష్టంగా రూ.300) ఇస్తోంది.