Tollywood: నటుడు బాలాజీ మోసం చేసినట్టు ప్రాథమిక సాక్ష్యాలు... కేసు నమోదు!

  • తనను మభ్యపెట్టి కిడ్నీ తీసుకున్నారన్న భాగ్యలక్ష్మి
  • చేస్తానన్న సాయం చేయలేదని ఆరోపణ
  • ఆపరేషన్ విజయవాడలో జరగడంతో కేసు అక్కడికే బదిలీ

భాగ్యలక్ష్మి అనే జూనియర్ ఆర్టిస్టును కిడ్నీ దానం విషయంలో సినీ నటుడు బాలాజీ మోసం చేసినట్టు ప్రాథమిక సాక్ష్యాలు లభ్యం కావడంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవాడలో జరగడంతో కేసును అక్కడికి బదిలీ చేస్తున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు.

తనను మభ్యపెట్టి కిడ్నీని తీసుకుని తన భార్యకు అమర్చుకున్నారని బాలాజీపై భాగ్యలక్ష్మి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సినిమాలు, టీవీల్లో అవకాశాలతో పాటు రూ. 20 లక్షలు, ఆపై నెలకు రూ. 15 వేల సాయం చేస్తామని బాలాజీ చెప్పాడని, ఆపై పట్టించుకోలేదని ఆమె ఆరోపించింది. కేసును విచారించిన పోలీసులు న్యాయ సలహా తీసుకున్న అనంతరం ఐపీసీ సెక్షన్ 420తో పాటు మానవ అవయవాల మార్పిడి చట్టం 1994లోని సెక్షన్ 19 ప్రకారం కేసు నమోదు చేసి, తదుపరి విచారణ నిమిత్తం విజయవాడకు బదిలీ చేశారు.

Tollywood
Hyderabad
Police
Balaji
Bhagyalakshmi
  • Loading...

More Telugu News