Srikakulam District: కొత్త పెళ్లి కూతురిని అవమానిస్తూ ఫేస్ బుక్ పోస్ట్... చెట్టుకు కట్టేసి చావగొట్టిన గ్రామస్థులు!

  • శ్రీకాకుళం జిల్లాలో ఘటన
  • ఫేస్ బుక్ పోస్టులపై గ్రామ పెద్దలకు దంపతుల ఫిర్యాదు
  • కౌన్సెలింగ్ నిర్వహించిన పోలీసులు

కొత్తగా పెళ్లయిన ఓ యువతిని అవమానించేలా ఫేస్ బుక్ లో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన యువకుడిని, అతనికి సహకరించిన వాళ్లను చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం రామునిపాలెంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, రామునిపాలెం గ్రామానికి చెందిన ఓ యువతికి, అదే గ్రామానికి చెందిన యువకుడితో వివాహమైంది.

గ్రామంలోని నక్కెట్ల శ్రీను అనే వ్యక్తి, ఆమెపై ఫేస్ బుక్ లో మార్ఫింగ్ చేసిన ఫొటోలు పోస్టు చేశాడు. వీటిని చూసిన నూతన దంపతులు, ఆగ్రహంతో విషయాన్ని గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీనును, శ్రీనుకు సహకరించిన రవి, సూర్యనారాయణలను పిలిపించి పంచాయితీ పెట్టారు. గ్రామం పరువు తీశారని ఆరోపిస్తూ, ముగ్గురినీ చెట్టుకు కట్టేశారు. తీవ్రంగా కొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అక్కడికి చేరుకుని వారిని విడిపించి, కేసు నమోదు చేశారు. నిందితులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.

Srikakulam District
Laveru
Ramunipalem
Facebook
Harrasment
  • Loading...

More Telugu News