Hyderabad: ఒక్క పెగ్గే తాగానన్న నటుడు కిరీటి దామరాజు... పోలీసులతో వాగ్వాదం!

  • డివైడర్ పైనే కూర్చున్న దామరాజు
  • సహకరించాల్సిందేనన్న పోలీసులు
  • సోమవారం కౌన్సెలింగ్.. మర్నాడు కోర్టుకు 

గతరాత్రి హైదరాబాద్, జూబ్లీహిల్స్ లో మద్యం తాగి కారు నడుపుతూ వచ్చిన నటుడు కిరీటి దామరాజు, పోలీసులతో కాసేపు వాగ్వాదానికి దిగాడు. 'ఏపీ 09 సీపీ 6893' నంబర్ గల కారులో వచ్చిన అతను మద్యం తాగి ఉన్నాడని గమనించిన పోలీసులు, తొలుత కారు నుంచి దిగాలని సూచించడంతో కారు దిగాడు. ఆపై కూర్చుని మాట్లాడుకుందామని ఓ అధికారి చెప్పడంతో డివైడరుపైనే కూర్చున్నాడు.

తాను ఒకేఒక పెగ్గు తాగానని కిరీటి చెప్పడంతో, "సమస్య ఏంటంటే... మీరు ఒకటా, రెండా అనేది కాదు. ఎక్కువ మోతాదులో తీసుకున్నారు. వాహనం అప్పగించి మాకు సహకరించాల్సిందే" అని పోలీసధికారి స్పష్టం చేశారు. దామరాజుకు బీఏసీ కౌంట్ 36గా చూపించడంతో, అతను పీకల్దాకా ఏమీ తాగనప్పటికీ, నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు. దామరాజుకు సోమవారం నాడు కౌన్సెలింగ్ నిర్వహించి, మంగళవారం నాడు కోర్టుకు తీసుకెళ్లనున్నామని అన్నారు.

Hyderabad
Police
Drunk Driving
Kireeti Damaraju
  • Loading...

More Telugu News