Smart Phone: ప్రపంచంలోనే తొలిసారిగా... క్రిప్టో కరెన్సీ లావాదేవీలకోసం బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్!
- 'సిరిన్ ఫిన్నే' పేరిట మార్కెట్లో
- 128 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్
- ధర రూ. 67,300
ప్రపంచంలోనే తొలిసారిగా క్రిప్టో కరెన్సీ లావాదేవీలు సైతం పూర్తి చేసుకునేలా బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో కూడిన తొలి స్మార్ట్ ఫోన్ ను స్విట్జర్లాండ్ కు చెందిన సిరిన్ ల్యాబ్స్ ఆవిష్కరించింది. 'సిరిన్ ఫిన్నే' పేరిట మార్కెట్లోకి రానున్న ఈ ఫోన్ లో బిట్ కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీ లావాదేవీలను అతి తక్కువ ఫీజుతో చేసుకోవచ్చు. ఫాక్స్ కాన్ తో ఓ డీల్ కుదుర్చుకుని ఈ తరహా ఫోన్ ను అందుబాటులోకి తీసుకు వచ్చినట్టు సంస్థ ప్రకటించింది.
ఇక ఈ ఫోన్ లో 6.2 అంగుళాల డిస్ ప్లే, స్నాప్‌డ్రాగన్ 845 ఎస్‌ఓసీ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 12/8 ఎంపీ కెమెరాలు, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి. ఈ ఫోన్‌లో క్రిప్టో వాలెట్ కూడా అందుబాటులో ఉంటుంది. డిజిటల్ అసెట్స్ ను ఆఫ్ లైన్ లో కూడా స్టోర్ చేసుకునే సౌకర్యం ఇందులో ఉంటుంది. దీని ధర రూ. 67,300 రూపాయలుగా ఉండనుంది.