Nimmakayala Chinarajappa: వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం నుంచే పోటీ చేస్తాను: నిమ్మకాయల చినరాజప్ప

  • నన్ను ఈ నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆదరించారు
  • పలు అభివృద్ధి పనులు చేశాను
  • మరో చోటు నుంచి పోటీ చేస్తానని దుష్ప్రచారం అంటున్నారు

వచ్చే ఎన్నికల్లో తాను పెద్దాపురం నుంచే పోటీ చేస్తానని ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కోనసీమకు చెందిన తనను ఈ నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆదరించారని, తాను పలు అభివృద్ధి పనులు చేశానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను ఇక్కడి నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో చినరాజప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను ఈ నియోజకవర్గంలో చేయాల్సి పనులు ఇంకా కొన్ని ఉన్నాయని, డీఎస్పీ, అగ్నిమాపకశాఖల ఆఫీసుల భవనాల నిర్మాణాలు పూర్తవుతున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చినరాజప్ప అన్నారు.  

Nimmakayala Chinarajappa
Andhra Pradesh
East Godavari District
  • Loading...

More Telugu News