deve gowda: 2008లోనే బీజేపీతో ఇబ్బందులు పడ్డాం.. అలాంటి పొరపాటు మళ్లీ చేయదల్చుకోలేదు: దేవెగౌడ

  • కన్నడిగులు ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తున్నారు 
  • ఎవరితోనూ పొత్తు పెట్టుకునే ఆలోచన లేదు 
  • జేడీఎస్ ఘన విజయం సాధిస్తుంది

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధినేత దేవెగౌడ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో కన్నడిగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని... ఇప్పుడు ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తున్నారని చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేశామని తెలిపారు.

కాంగ్రెస్ తో కానీ, బీజేపీతో కానీ పొత్తుపెట్టుకునే ఆలోచన తమకు లేదని అన్నారు. 2008లో బీజేపీతో కూటమి ఏర్పాటు చేసుకున్నామని... ఆ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డామని, ఇకపై అలాంటి పని చేయదల్చుకోలేదని చెప్పారు. హాసన్ జిల్లాలోని తన స్వగ్రామం హోలెనరసిపురలో దేవెగౌడ, ఆయన భార్య చెన్నమ్మలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

deve gowda
karnataka elections
BJP
Congress
jds
  • Loading...

More Telugu News