gannavaram: గన్నవరం విమానాశ్రయ పరిధిలో 55 రోజులపాటు 144 సెక్షన్‌

  • భద్రతా కారణాలు సహా వీఐపీల రాకపోకల దృష్ట్యా ఆంక్షలు
  • నేటి నుంచి జులై 5 వరకు కొనసాగింపు
  • ఉత్తర్వులు జారీ

భద్రతా కారణాలు సహా వీఐపీల రాకపోకలు అధికంగా ఉండటంతో నేటి నుంచి జులై 5 వరకు (55 రోజుల పాటు) కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయం పరిధిలో 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేస్తూ... ఆ పరిసర ప్రాంతాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించకూడదని తేల్చి చెప్పారు. విమానాశ్రయ ప్రాంతం నుంచి 250 మీటర్ల పరిధిలో ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. పలు కారణాల వల్ల శాంతి భద్రతలతో పాటు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్‌ విధించినట్లు పేర్కొన్నారు.      

gannavaram
Krishna District
airport
  • Loading...

More Telugu News