anu emmanuel: అనూ ఇమ్మాన్యుయేల్ ఫీలవుతోందట, పాపం!

- యూత్ లో అనూకి మంచి క్రేజ్
- ఆశించిన స్థాయిలో పడని హిట్లు
- 'శైలజా రెడ్డి అల్లుడు' పైనే ఆశలు
తెలుగు తెరకి 'మజ్ను' సినిమా ద్వారా పరిచయమైన అనూ ఇమ్మాన్యుయేల్ గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తరువాత చేసిన 'కిట్టు వున్నాడు జాగ్రత్త' కూడా ఆమెకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సమయంలోనే ఆమెకి పవన్ సరసన 'అజ్ఞాతవాసి' .. అల్లు అర్జున్ జోడీగా 'నా పేరు సూర్య'లో అవకాశాలు వచ్చాయి.
