Karnataka: కర్ణాటకలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువతకు ఉచితంగా దోశ!

  • నిసర్గ గ్రాండ్ హోటల్ యజమాని కృష్ణరాజ్ వినూత్న ఆలోచన
  • తొలిసారి ఓటు వేసే యువతకు దోశ
  • ఓటు హక్కును వినియోగించుకునే వారికి ఫిల్టర్ కాఫీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు బెంగళూరులోని ఓ హోటల్ నిర్వాహకుడు వినూత్న ఆలోచన చేశారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకునే యువతకు తన హోటల్ లో ఉచితంగా దోశ అందిస్తున్నారు. అంతేకాకుండా, తమ ఓటు హక్కు వినియోగించుకునే వారికి ఉచితంగా ఫిల్టర్ కాఫీని అందిస్తున్నారు. ఈ వినూత్న ఆలోచన చేసింది నిసర్గ గ్రాండ్ హోటల్ యజమాని కృష్ణరాజ్.

ఈ విషయం తెలిసిన మీడియా ఆయన్ని పలకరించగా.. ఓటు వేసిన ఓటర్లు తమ వేలిపై సిరా గుర్తును హోటల్ సిబ్బందికి చూపిస్తే.. దోశ, ఫిల్టర్ కాఫీ ఇస్తారని చెప్పారు. అసలు, ఈ ఆలోచన రావడానికి కారణం గురించి ఆయన ప్రస్తావించారు. బెంగళూరులో నమోదవుతున్న తక్కువ ఓటింగ్ శాతాన్ని పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఓటర్లు ఏ అభ్యర్థికి ఓటు వేశారనే దాని కన్నా, ఓటు హక్కు వినియోగించుకున్నారా? లేదా? అనేది ముఖ్యమని అన్నారు.

  • Loading...

More Telugu News