keerthi suresh: 'మహానటి' దర్శక నిర్మాతలను ఇంటికి ఆహ్వానించి.. సత్కరించిన చిరంజీవి!

- హిట్ టాక్ తెచ్చుకున్న 'మహానటి'
- ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ
- ప్రముఖుల నుంచి ప్రశంసలు
సావిత్రి జీవితచరిత్రను 'మహానటి' పేరుతో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. ఈ సినిమాను అశ్వనీదత్ కుమార్తెలు స్వప్న దత్ .. ప్రియాంక దత్ లు నిర్మించారు. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు .. ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది.
