Prime Minister: నేపాల్ ముక్తినాథ్ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు

  • నేడు పశుపతినాథ్ ఆలయం సైతం సందర్శన
  • అనంతరం నేపాల్ అధినాయకులతో చర్చలు
  • తర్వాత ఢిల్లీకి తిరుగు ప్రయాణం

ప్రధాని మోదీ తన రెండు రోజుల నేపాల్ పర్యటనలో ఈ రోజు ముక్తినాథ్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బౌద్ధ సంప్రదాయంలో ఎర్రటి వస్త్రాన్ని ధరించిన ఆయన అటు బౌద్ధం, ఇటు హిందూ సంప్రదాయ విధానంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ రోజే ఖాట్మండులోని పశుపతినాథ్ ఆలయాన్ని కూడా మోదీ సందర్శించనున్నారు.

అనంతరం నేపాల్ కీలక నాయకులతో చర్చల్లో పాల్గొంటారు. ఖాట్మండు మెట్రో పాలిటన్ సిటీ నిర్వహించే రిసెప్షన్ లో పాల్గొన్న అనంతరం ప్రధానమంత్రి మోదీ తిరిగి ఢిల్లీకి ప్రయాణం అవుతారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నేపాల్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని నిన్న జనక్ పూర్ లోని జానకీమాత ఆలయంలో కూడా పూజలు చేసిన విషయం విదితమే.

Prime Minister
Narendra Modi
nepal
  • Loading...

More Telugu News