Karnataka: ఓటు హక్కు వినియోగించుకున్న జేడీఎస్ అధినేత దేవెగౌడ

  • కొనసాగుతున్న కర్ణాటక ఎన్నికల పోలింగ్
  • హొళెనరసిపురలో ఓటు వేసిన దేవెగౌడ, ఆయన సతీమణి  
  • ఓటర్లకు డబ్బు పంచుతూ పట్టుబడ్డ జేడీఎస్ నాయకుడు మల్లేశ్
  • శ్రీరాంపురం పోలీస్ స్టేషన్ కు తరలింపు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. హసన్ జిల్లా హొళెనరసిపురలో దేవెగౌడ, ఆయన సతీమణి చెన్నమ్మలు తమ ఓట్లు వేశారు. కాగా, ఈరోజు ఉదయం తొమ్మిది గంటల వరకు 10.6 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

ఇదిలా ఉండగా, జేడీఎస్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ మల్లేశ్ ను పోలీసులు అరెస్టు చేశారు. గాంధీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లకు డబ్బు పంచుతుండగా ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, శ్రీరాంపురం పోలీస్ స్టేషన్ కు మల్లేశ్ ను పోలీసులు తరలించారు. 

Karnataka
deve gowda
  • Loading...

More Telugu News