Chandrababu: టీడీపీ కార్యకర్తల్లోని సుగుణాన్ని బయటపెట్టిన చంద్రబాబు!

  • పోలింగ్ బూత్ దగ్గర నిల్చునేది కార్యకర్తలే
  • సొంత డబ్బుతో పనిచేసే కార్యకర్తలు టీడీపీ సొంతం
  • కొన్ని రోజులు అలిగినా, మళ్లీ ఒక్కతాటిపైకి వస్తారు

టీడీపీ కార్యకర్తల్లో దాగున్న సుగుణాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఉండవల్లిలోని ప్రజాదర్బారు హాల్‌లో శుక్రవారం నిర్వహించిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ కార్యకర్తల సేవలను కొనియాడారు. ఎన్ని సమస్యలున్నా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తారని కార్యకర్తలను ప్రశంసించారు. సొంత డబ్బుతో పనిచేసే కార్యకర్తలు టీడీపీ సొంతమని పేర్కొన్న చంద్రబాబు.. వారు నాలుగైదు రోజులు అలిగినా ఎన్నికల సమయానికి మళ్లీ అందరూ ఏకతాటిపైకి వస్తారని పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తల్లోని సుగణం అదేనని వివరించారు.

పోలింగ్ బూత్ దగ్గర అధికారులు నిలబడరని, కార్యకర్త మాత్రమే నిలబడతాడన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలని నేతలకు సూచించారు. 90 శాతం కార్యకర్తలు కోరుకునేది గౌరవమేనని, వారికి అది దక్కేలా చూడాలని అన్నారు. ఓ గడువు పెట్టుకుని ఆ లోపు కార్యకర్తలతో సత్సంబంధాలను పెంచుకోవాలని ఆదేశించారు. తాను కూడా ఇకపై పార్టీ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తానని పేర్కొన్నారు. అందరం సమష్టిగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేద్దామని అన్నారు.

Chandrababu
Telugudesam
Workers
  • Loading...

More Telugu News