Hyderabad: ప్రజలపై ఆదాయపుపన్ను భారం వేయకూడదంటోన్న సుబ్రహ్మణ్య స్వామి
- ఇలా చేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి
- పొదుపులు పెరుగుతాయి
- పెట్టుబడుల పెరుగుదలకు దారితీస్తుంది
- ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చిన బీజేపీ ఎంపీ
దేశంలో ఆదాయపు పన్నును రద్దు చేయాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఇలా చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని, పొదుపులు పెరుగుతాయని, పెట్టుబడుల పెరుగుదలకు దారితీస్తుందని చెప్పుకొచ్చారు. ఈ రోజు ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ... ఆదాయపు పన్ను వల్ల దేశంలో మధ్య తరగతి ప్రజలతో పాటు స్టార్ట్‌ఆప్ కంపెనీలు ఆ భారాన్ని అధికంగా మోస్తున్నాయని తెలిపారు.
అసలు చాలా తక్కువమంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారని, మరి అలాంటి వారిమీద భారాన్ని మోపడం ఎందుకని ప్రశ్నించారు. ఆదాయపన్నును రద్దు చేసి దేశంలో ఉన్నత ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించాలని, ఆదాయ పన్ను రద్దు చేయటం వల్ల కోల్పోయిన ఆదాయాన్ని బొగ్గు బ్లాక్స్, స్పెక్ట్రం వంటి సహజ వనరుల వేలం ద్వారా పెంచుకోవచ్చని తెలిపారు.