rashmi goutam: మహిళలపై లైంగిక వేధింపులు ప్రతి చోటా జరుగుతున్నాయి!: రష్మీ గౌతమ్

  • కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీని లక్ష్యంగా చేసుకోవద్దు
  • ‘క్యాస్టింగ్ కౌచ్’ను ఓ అంశంగా చేయొద్దు 
  • ఈ దారుణాలను ఆపేందుకు మన వంతు ప్రయత్నం చేద్దాం

మహిళలపై లైంగిక వేధింపులు ప్రతి చోటా జరుగుతున్నాయని, కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీని లక్ష్యంగా చేసుకుని ఈ అంశాన్ని మరింత పెద్దదిగా చేయడం ఆపాలని ప్రముఖ యాంకర్ - నటి రష్మీ గౌతమ్ కోరింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను ‘క్యాస్టింగ్ కౌచ్’ పేరిట ఫిల్మ్ ఇండస్ట్రీని లక్ష్యంగా చేసుకోవడం తగదని సూచించింది. ‘క్యాస్టింగ్ కౌచ్’ను ఓ అంశంగా చేస్తూ.. చౌకబారు సంతోషం పొందడం కన్నా ఈ దారుణాలు జరగకుండా ఆపేందుకు మన వంతు ప్రయత్నం చేద్దామని రష్మీ సూచించింది. కాగా, రష్మీ చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్లు భిన్న వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News