Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ సీఎం వ్యాఖ్యలను తప్పుబట్టిన బీజేపీ నేత రామ్ మాధవ్!

  • ఏకపక్షంగా కాల్పుల విరమణను కేంద్రం ప్రకటించాలన్న ముఫ్తీ
  • ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదన్న రామ్ మాధవ్   
  • కశ్మీర్ లోయలో ఉగ్రవాదం నిలిచిపోతే భద్రతా దళాల కాల్పులూ ఆగిపోతాయి

కశ్మీర్ లోయలో ఏకపక్షంగా కాల్పుల విరమణను కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలంటూ జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ స్పందించారు. ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.

 ‘కాల్పుల విరమణ’ అనే పదాన్ని ముఫ్తీ ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కశ్మీర్ లోయలో ఉగ్రవాదం నిలిచిపోతే భద్రతా దళాలు కూడా తమ చర్యలు ఆపివేస్తాయని, రంజాన్ సమయంలో టెర్రరిస్టులు తమ కార్యకలాపాలకు దూరంగా ఉంటే భద్రతా దళాల ఆపరేషన్లూ వాటంతటవే ఆగిపోతాయిని అన్నారు.

 కేంద్రం ‘కాల్పుల విరమణ’ను ప్రకటించడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదని కాదని అభిప్రాయపడ్డారు. కాగా, వాజ్ పేయి ప్రధాని గా ఉన్న సమయంలో జమ్మూకశ్మీర్ లో ఏకపక్షంగా కాల్పుల విరమణను ప్రకటించిన విషయాన్ని ముఫ్తీ ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించారు. ఇదే మాదిరిగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన చేసే విషయమై ఆలోచన చేయాలని ఆమె కోరారు.

Jammu And Kashmir
mehabuba mufti
bjp
ram madhav
  • Loading...

More Telugu News