CPI Narayana: తిరుపతి ఘటనను దాడిలా చూడటం సరికాదు!: సీపీఐ నారాయణ
- ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందన్న ఆవేదన ప్రజల్లో ఉంది
- ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీని వ్యతిరేకించడం సహజమే
- తెలుగు ప్రజలు ఎంత అసంతృప్తితో ఉన్నారో అర్థమౌతుంది
తిరుపతిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ పై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడిన సంఘటనపై సీపీఐ నేత నారాయణ తన దైన శైలిలో భాష్యం చెప్పారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిరసనను దాడిలా చూడటం సరికాదని, ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందన్న ఆవేదన, ఆవేశం ప్రజల్లో ఉన్నాయని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీని వ్యతిరేకించడం సహజమేనని, ఈ సంఘటన ద్వారా తెలుగు ప్రజలు ఎంత అసంతృప్తితో ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరముందని, ‘హోదా’ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని నారాయణ విమర్శించారు.