nagarjuna: 'ఆఫీసర్' విడుదల తేదీ ఖరారు .. రేపే ట్రైలర్ రిలీజ్

  • వర్మ దర్శకత్వంలో 'ఆఫీసర్' 
  • నాగ్ సరసన మైరా సరీన్ 
  • ఈ నెల 25వ తేదీన రిలీజ్

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున చేసిన 'ఆఫీసర్' సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నట్టు నాగార్జున ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

ఈ లోగా ఆయన అభిమానులను ఖుషీ చేయడానికి గాను, ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదలనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రేపు వదిలే ట్రైలర్ తో మరింతగా అంచనాలు పెరగాలని భావిస్తున్నారు. నాగార్జున పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమాలో ఆయన జోడీగా మైరా సరీన్ కనిపించనుంది. నాగ్ .. వర్మ కాంబినేషన్లో ఈ సినిమాతో మరో హిట్ పడుతుందేమో చూడాలి.     

  • Loading...

More Telugu News