keerti suresh: సావిత్రిలా కనిపించడం వేరు .. ఆమెలా నటించడం వేరు: కీర్తి సురేశ్ గురించి సాయిమాధవ్ బుర్రా

- సావిత్రి పాత్రకి కీర్తి సురేశ్ కరెక్ట్ గా సరిపోయింది
- కీర్తి సురేశ్ ను సెట్లో చూసి సావిత్రి గారు అనుకున్నాను
- సావిత్రిగారిలా ఆమె అద్భుతంగా చేసింది
ఈ నెల 9వ తేదీన విడుదలైన 'మహానటి' అశేష ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రాయడమే కాకుండా, 'పింగళి నాగేంద్రరావు'లా నటించారు. తాజాగా ఆయన ఈ సినిమాను గురించి ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
