somireddy: బీజేపీ మా కార్యకర్తలను రెచ్చగొడుతోంది: రాళ్లదాడిపై ఏపీ మంత్రి సోమిరెడ్డి

  • ఈ ఘటన దురదృష్టకరం
  • బీజేపీ నేతలు ఏపీపై అభ్యంతరకర వ్యాఖ్యలు
  • కర్ణాటక ప్రజలు కూడా గమనిస్తున్నారు

భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా కాన్వాయ్‌పై రాళ్లదాడి జరిగిన ఘటన దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని వెళుతోన్న అమిత్ షా కాన్వాయ్‌పై అలిపిరి వద్ద టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తమ కార్యకర్తలను బీజేపీ నేతలే రెచ్చగొడుతున్నారని అన్నారు. బీజేపీ నేతలు ఏపీపై చేస్తోన్న వ్యాఖ్యలను కర్ణాటక ప్రజలు కూడా గమనిస్తున్నారని, ఆ పార్టీకి బుద్ధి చెబుతారని అన్నారు. 

somireddy
Andhra Pradesh
Telugudesam
  • Loading...

More Telugu News