kohli: కోహ్లీ రెస్టారెంట్ లో సందడి చేసిన ఆర్సీబీ ఆటగాళ్లు

  • ఢిల్లీలో నుయేవా పేరుతో రెస్టారెంట్ నిర్వహిస్తున్న కోహ్లీ
  • నిన్న రాత్రి తన సహచరులను రెస్టారెంట్ కు తీసుకెళ్లిన కెప్టెన్
  • అన్ని వెరైటీలను ఎంజాయ్ చేసిన ఆర్సీబీ ప్లేయర్లు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఢిల్లీలో ఓ రెస్టారెంట్ ఉంది. 'నుయేవా' పేరుతో నిర్వహిస్తున్న ఈ రెస్టారెంట్ కు మంచి పేరు ఉంది. నిన్న రాత్రి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆటగాళ్లందరూ ఈ రెస్టారెంటులో సందడి చేశారు. తమకు నచ్చిన ఆహార పదార్థాలను రుచి చూశారు. ఈ సందర్భంగా డీవిలియర్స్ తో కలసి దిగిన ఫొటోను కోహ్లీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఇమ్రాన్ తాహిర్, క్రిస్ వోక్స్, చాహల్ లతో పాటు పలువురు ఆటగాళ్లు రెస్టారెంట్ కు వచ్చినవారిలో ఉన్నారు.

ఐపీఎల్ లో భాగంగా బెంగళూరు జట్టు ఢిల్లీకి వచ్చినప్పుడు ఆటగాళ్లకు తన రెస్టారెంట్ వంటకాలను రుచి చూపించడం కోహ్లీకి అలవాటు. ఈ ఏడాది కూడా ఎప్పటిలాగానే తన సహచరులను రెస్టారెంట్ కు తీసుకెళ్లాడు కోహ్లీ. ఢిల్లీ, బెంగళూరు జట్ల మధ్య శనివారం మ్యాచ్ జరగనుంది.

kohli
restaurant
nuyeva
rcb
  • Error fetching data: Network response was not ok

More Telugu News