balakrishna: బాలకృష్ణ అంకితభావం చూస్తే ఆశ్చర్యపోవలసిందే!: సాయిమాధవ్ బుర్రా

  • బాలకృష్ణ  ప్రామ్టింగ్ పై ఆధారపడరు 
  • ఒకటికి రెండుసార్లు డైలాగ్స్  చూసుకుంటారు
  • తన పాత్ర పట్ల పూర్తి అవగాహనకి వస్తారు  

బాలకృష్ణ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'గౌతమి పుత్ర శాతకర్ణి' ఒకటి. ఈ సినిమాకి సాయిమాధవ్ బుర్రా రాసిన సంభాషణలకు మంచి పేరు వచ్చింది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఎన్టీఆర్ బయోపిక్ కి కూడా ఆయనే మాటలు రాశారు. ఈ నేపథ్యంలో ఆయన బాలకృష్ణ గురించి ప్రస్తావించారు.

"ఏ విషయంలోనైనా బాలకృష్ణ చాలా కరెక్ట్ గా వుంటారు .. ఎదుటివారు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. తన పాత్ర గురించి తెలుసుకుని ఆయన పూర్తి అవగాహనకి వస్తారు. ఒకటికి రెండు సార్లు డైలాగ్స్ చూసుకుంటారు. ప్రామ్టింగ్ పై ఆయన ఆధారపడరు .. ఎంతపెద్ద డైలాగ్ అయినా సరే ప్రాక్టీస్ చేసి చెప్పడానికే ఇష్టపడతారు. ఏ విషయమైనా పైపైన తేల్చేయడం ఆయనలో మనకి కనిపించదు. ప్రతి విషయంపై ఆయన పూర్తి అవగాహనకి వచ్చే తీరు .. ఆయన అంకితభావం నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి" అన్నారు.

balakrishna
sai madhav burra
  • Loading...

More Telugu News