amith shah: అమిత్‌ షా కాన్వాయ్‌పై దాడి ఘటనపై చంద్రబాబు ఆగ్రహం

  • టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ
  • అందరూ దానికి కట్టుబడి ఉండాలి
  • ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
  • ఇటువంటి ప్రవర్తనతో పార్టీకి చెడ్డపేరు తీసుకురావద్దు

ప్రత్యేక హోదాపై నిరసన తెలుపుతూ ఈ రోజు తిరుపతిలోని అలిపిరి వద్ద బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా కాన్వాయ్ పై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని, టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అని, అందరూ దానికి కట్టుబడి ఉండాలని చెప్పారు. క్రమశిక్షణను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఇటువంటి ప్రవర్తనతో పార్టీకి చెడ్డపేరు తీసుకురావద్దని సూచించారు. ఏ సమయంలో ఎలా స్పందించాలో అందరూ తెలుసుకోవాలని, అధికారంలో ఉన్నప్పుడు మరింత బాధ్యతగా ఉండాలని ఆయన అన్నారు.

amith shah
Chandrababu
Andhra Pradesh
Tirupati
  • Loading...

More Telugu News