Narendra Modi: చివరకు గెలిచేది ప్రజాబలమే!: మోదీపై మండిపడ్డ బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా

  • ప్రసంగాలు హుందాగా, మర్యాదకరంగా ఉండాలి
  • పరిధి దాటి వ్యక్తిగత దాడులు చేయడం దారుణం
  • ధన బలం గెలవదు.. చివరకు ప్రజా బలమే గెలుస్తుంది

ప్రధాని మోదీపై బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా మరోసారి విరుచుకుపడ్డారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ చేసిన ప్రసంగాలను తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీపై, ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీపై మోదీ చేసిన వ్యాఖ్యలు సిగ్గు చేటని అన్నారు. పరిమితికి దాటి వ్యక్తిగత దాడులు చేయడం సహించలేని విషయమని మండిపడ్డారు.

ప్రసంగాలు హుందాగా, మర్యాదకరంగా ఉండాలని మోదీకి సూచించారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగిసే సమయంలో వరుస ట్వీట్లు చేస్తూ... ఎన్నికల్లో ధనబలం గెలవదని, చివరకు ప్రజా బలమే గెలుస్తుందని చెప్పారు. బీహార్ నుంచి కర్ణాటకు వరకు తనను స్టార్ క్యాంపెయినర్ గా బీజేపీ ఆహ్వానించలేదని... అయినా పార్టీ సానుభూతిపరుడిగా తాను ఈ సూచనలు చేస్తున్నానని తెలిపారు. ఇటీవలి కాలంలో మోదీ విధానాలను శత్రుఘ్నసిన్హా పలుమార్లు బహిరంగంగానే తప్పుబట్టిన సంగతి తెలిసిందే.

Narendra Modi
shatrughan sinha
karnataka elections
tweet
  • Loading...

More Telugu News