Chandrababu: బోటులో అగ్నిప్రమాదంపై ఆరాతీసిన చంద్రబాబు

  • తూర్పుగోదావరి జిల్లా కలెక్టరుతో మాట్లాడిన చంద్రబాబు
  • ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలంటూ ఆదేశం
  • యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలంటూ ఆదేశాలు

పాపికొండలుకు వెళ్తున్న టూరిస్ట్ బోటులో అగ్నిప్రమాదం సంభవించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరుతో మాట్లాడిన ముఖ్యమంత్రి... వేరే బోటులో ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికితోడు, ప్రయాణికుల యోగక్షేమాలను తనకు ఎప్పటికప్పుడు తెలపాలని ఆదేశించారు.

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం వీరవరపులంక వద్ద టూరిస్ట్ బోటులో మంటలు రేగిన సంగతి తెలిసిందే. గ్యాస్ సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ సమయంలో బోటులో 90 మంది ప్రయాణికులు ఉన్నారు. పాపికొండలుకు విహారయాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. 

  • Loading...

More Telugu News