kumaraswamy gowda: ఎక్కువ కాలం బతకలేను.. గెలిపించి కాపాడండి: 'జేడీఎస్' నేత కుమారస్వామి

  • నా ఆరోగ్యం బాగోలేదు
  • అనారోగ్యంతోనే ప్రచారం చేశా
  • మీకు సేవ చేయాలనే తపన ఉంది

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనారోగ్యంతోనే ప్రచారం నిర్వహించానని... తన ఆరోగ్యం బాగోలేదని... ఎక్కువ కాలం బతకలేనని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో జేడీఎస్ కు మద్దతు ఇచ్చి తనను బతికించాలని కోరారు. ప్రజలకు సేవ చేయాలనే తపన తనలో ఉందని చెప్పారు.

 జేడీఎస్ అధికారంలోకి వస్తే మీ ఇంటి బిడ్డలా మీకు సేవ చేస్తానని తెలిపారు. నేను మీకు కావాలనుకుంటే జేడీఎస్ ను గెలిపించాలని దీనంగా వేడుకున్నారు. నిన్న ఎన్నికల ప్రచారం ముగింపు సభ సందర్భంగా రాజరాజేశ్వరినగర్ నియోజకవర్గంలోని లగ్గెరెలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజరాజేశ్వరినగర్ లో నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు పట్టుబడటంపై ఆధారాలతో సహా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 

kumaraswamy gowda
karnataka
elections
ill
  • Loading...

More Telugu News