Undavalli: చంద్రబాబుకు లేఖ రాసిన ఉండవల్లి అరుణ్ కుమార్

  • విభజనకు సంబంధించి సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేయండి
  • నా పిటిషన్ కు కేంద్రం ఇంతవరకు అఫిడవిట్ దాఖలు చేయలేదు
  • రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ వేస్తే, కేంద్రాన్ని నిలదీయొచ్చు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారు. రాష్ట్ర విభజనకు సంబంధించి సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని లేఖలో సీఎంను కోరారు. ఏపీ విభజనకు వ్యతిరేకంగా తాను పిటిషన్ దాఖలు చేశానని... దీనిపై ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయకపోవడం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తే, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉంటే... ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు.

Undavalli
Chandrababu
letter
Andhra Pradesh
Supreme Court
  • Loading...

More Telugu News