Narendra Modi: నేపాల్ లో అడుగుపెట్టిన ప్రధాని మోదీ... జానకీ ఆలయంలో ప్రార్థనలు

- జనక్ పూర్ లో మోదీకి స్వాగతం పలికిన నేపాల్ ప్రధాని
- రేపు పశుపతినాథ్ ఆలయ సందర్శన
- రెండు రోజుల పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం 11.05 గంటలకు నేపాల్ లోని జనక్ పూర్ లో అడుగు పెట్టారు. ఆయనకు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ జానకీ ఆలయంలో ప్రార్థనలు నిర్వహించారు. రేపు ఉదయం ఖాట్మండులోని పశుపతినాథ్ ఆలయాన్ని మోదీ సందర్శించనున్నారు. భారత ప్రధానికి స్వాగతం పలికేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తామని పశుపతినాథ్ ఆలయ ట్రస్ట్ సభ్యుడు ప్రదీప్ ఢాకల్ తెలిపారు.

