whatsapp: వాట్సాప్ నుంచే ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ చూసుకోవచ్చు!
- త్వరలో అందుబాటులోకి కొత్త ఫీచర్
- చాట్ చేస్తూనే చూసుకోవచ్చు
యూజర్ల సౌకర్యార్థం వాట్సాప్ మరో ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లో అకౌంట్లు ఉన్నవారు వాట్సాప్ నుంచే ఆయా అకౌంట్ల కంటెంట్ చూసుకునే అవకాశం కల్పించింది. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లేదా ఈ తరహా యాప్స్ నుంచి వచ్చే వీడియోలు, ఫొటోలను ఆయా యాప్ లకు రీడైరెక్ట్ చేయడం ద్వారా చూసుకోవచ్చు.
కొత్త అప్ డేట్ లో ఈ ఫీచర్ రానుంది. ఎంపిక చేసిన ఐవోఎస్ యూజర్లకు వాట్సాప్ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ లో చాట్ చేస్తూనే ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ కంటెంట్ ను కూడా చూసుకోవచ్చు. వీటితోపాటు గ్రూపు చాట్ లో గ్రూపు ఐకాన్, స్టేటస్ మార్పుల అధికారం కేవలం అడ్మిన్లకే కల్పించే అప్ డేట్ కూడా రానుంది.