relainace jio: 50 పైసలకే అమెరికా, కెనడాకు కాల్ చేసుకోవచ్చు... జియో నుంచి రూ.199 ప్లాన్
- ఈ నెల 15 నుంచి అమల్లోకి
- రూ.50 పైల నుంచి రూ.6 వరకు వివిధ దేశాలకు చార్జీలు
- అంతర్జాతీయంగా ఉచిత రోమింగ్
రిలయన్స్ జియో రూ.199కు ఓ పోస్ట్ పెయిడ్ మంత్లీ ప్లాన్ ను ప్రకటించింది. ఈ నెల 15 నుంచి ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. అపరిమితంగా కాల్స్, అంతర్జాతీయ రోమింగ్ సదుపాయాలను పొందొచ్చు. 25 జీబీ డేటా కూడా ఉచితంగా లభిస్తుంది. అలాగే, అపరిమితంగా ఎస్ఎంఎస్ లను కూాడా పంపుకోవచ్చు. ఎటువంటి డిపాజిట్ అవసరం లేకుండానే ఐఎస్డీ కాలింగ్ ను సైతం యాక్టివేట్ చేసుకోవచ్చు.
అమెరికా, కెనడాలకు నిమిషానికి 50 పైసలకే మాట్లాడుకోవచ్చు. బంగ్లాదేశ్, చైనా, ఫ్రాన్స్, ఇటలీ, న్యూజిలాండ్, సింగపూర్, బ్రిటన్ దేశాలకు చేసే కాల్స్ పై నిమిషానికి రూ.2 చార్జీ, హాంగ్ కాంగ్, ఇండోనేషియా, మలేషియా, టర్కీ దేశాలకు నిమిషానికి రూ.3, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, పాకిస్తాన్ థాయిలాండ్ దేశాలకు నిమిషానికి రూ.4, జర్మనీ, ఐర్లాండ్, జపాన్, కువైట్, రష్యా, వియత్నాం దేశాలకు నిమిషానికి రూ.5, ఇజ్రాయెల్, నైజీరియా, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, స్పెయిన్, స్వీడన్, ఈయూఏ, ఉజ్బెకిస్తాన్ దేశాలకు రూ.6కు చెల్లించి మాట్లాడుకునేందుకు అవకాశం ఉంది. ఈ కాలింగ్ చార్జీలు ప్రీపెయిడ్ కస్టమర్లకూ అమలవుతాయి