amravathi: రామానాయుడు, రాఘవేంద్రరావులకు భూములిచ్చినా ఉపయోగం లేదు: సెన్సార్ బోర్డు సభ్యుడు దిలీప్ రాజా

  • అమరావతిలో సినీ నిర్మాణాలకు అవకాశం ఎందుకు కల్పించలేదు
  • స్టూడియోల నిర్మాణాలకు భూములను ఇవ్వాలి
  • అప్పుడే సొంత రాష్ట్రంలో సినిమా నిర్మాణ జరుగుతుంది

ఏపీ రాజధాని అమరావతిలో సినీ నిర్మాణాలకు ప్రభుత్వం ఇంతవరకు అవకాశం ఎందుకు కల్పించలేదని సెన్సార్ బోర్డు సభ్యుడు దిలీప్ రాజా ప్రశ్నించారు. అమరావతిలో వసతులు కల్పించాలని కోరుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పారు. విశాఖపట్నంలో రామానాయుడు, రాఘవేంద్రరావులాంటి వారికి భూములు కేటాయించినప్పటికీ, వారు వాటిని ఇంతవరకు వినియోగంలోకి తీసుకురాలేదని అన్నారు. సుల్తానాబాద్ లోని 'మా ఏపీ' సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు.

అమరావతిలో స్టూడియోలను నిర్మిస్తే... సొంత రాష్ట్రంలో సినిమాల నిర్మాణం జరుగుతుందని, దీనికి తోడు ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుతుందని దిలీప్ రాజా చెప్పారు. ఎన్నో సంస్థలకు భూములను ఇస్తున్న ప్రభుత్వం... స్టూడియోల ఏర్పాటుకు కూడా భూములు ఇవ్వాలని కోరారు.

amravathi
film
shooting
studios
censor board
dileep raja
  • Loading...

More Telugu News