Tollywood: ఇక క్యాస్టింగ్ కౌచ్ భయం అక్కర్లేదు.. యాప్‌ను ఆవిష్కరించిన దర్శకుడు మారుతి

  • సినిమా అవకాశాల కోసం ‘సెలబ్ కనెక్ట్’ యాప్
  • గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యం
  • వివరాలు నమోదు చేసుకుంటే అవకాశాలు
  • పూర్తిగా సురక్షితం

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇక క్యాస్టింగ్ కౌచ్ భయం అక్కర్లేదు. ఎటువంటి భయాలు లేకుండా నేరుగా సినిమా అవకాశాలు కల్పించే ఉద్దేశంతో రూపొందించిన సరికొత్త యాప్‌ను గురువారం దర్శకుడు మారుతి ఆవిష్కరించారు. ‘సెలబ్ కనెక్ట్’ పేరుతో రూపొందించిన ఈ యాప్‌ను సంస్థ సీఈవో సుమన్, నటి సెబ కోషి, చిత్ర దర్శకుడు మనో వికాస్‌లతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓ కంపెనీ కార్యాలయంలో మారుతి ఆవిష్కరించారు.

చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించే వారికి ఈ యాప్ చక్కగా ఉపయోగపడుతుందని మారుతి అన్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీనిని డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు. యాప్‌లో తమ వివరాలను నమోదు చేసుకున్న వారిని అవసరానికి అనుగుణంగా ఎంపిక చేసి అవకాశాలు కల్పిస్తామన్నారు. యువతకు అవకాశాలు కల్పించే ఉద్దేశంతో పూర్తి సురక్షితంగా ఈ యాప్‌ను రూపొందించినట్టు మారుతి వివరించారు. ఈ యాప్ వల్ల సినీ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందని పేర్కొన్నారు.

Tollywood
Hyderabad
celeb connect
Maruthi
  • Loading...

More Telugu News