IMD: నేడు, రేపు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక!

  • ఒడిశా చుట్టుపక్కల ద్రోణి ప్రభావం
  • ఉత్తర కోస్తా, రాయలసీమలపై ప్రభావం
  • తెలంగాణలోనూ వర్షాలకు అవకాశం

ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అధికారులు పేర్కొన్నారు. ఒడిశా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

శ్రీకాకుళం నుంచి ఉభయ గోదావరి జిల్లాలు, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ద్రోణి ప్రభావం ఉంటుందని, అకాల వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. మరోవైపు మధ్య మహారాష్ట్ర నుంచి చత్తీస్ గఢ్ వరకూ నెలకొన్న ద్రోణి ప్రభావంతో ఉత్తర తెలంగాణలోని కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాల ప్రభావం లేని ప్రాంతాల్లో సాధారణం కన్నా రెండు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది.

  • Loading...

More Telugu News