Sivaji: ముగిసిన నటుడు శివాజీ జాగారం.. బీజేపీ ఓటమి కోసమేనన్న నటుడు

  • నేటి ఉదయం ముగిసిన జాగారం
  • పవన్ పోరాడితే ప్రత్యేక హోదా వస్తుంది
  • తెలుగు ప్రజలంటే మోదీకి చిన్నచూపు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం సినీ నటుడు శివాజీ గురువారం సాయంత్రం 7 గంటలకు చేపట్టిన జాగారం నేటి ఉదయం 7 గంటలకు ముగిసింది. జాగారాన్ని ముగించిన అనంతరం శివాజీ మాట్లాడుతూ.. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి కోసమే జాగారం చేసినట్టు తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ 8 మంది అవినీతిపరులకు సీట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. బీజేపీకి ఓటు వేయవద్దని కన్నడ ప్రజలను కోరారు. అలాగే, జేడీఎస్‌ను నమ్మడానికి వీల్లేదన్నారు. తెలుగు ప్రజలంటే మోదీకి చిన్నచూపని విమర్శించారు.

విమర్శలతో ఎటువంటి ప్రయోజనం లేదని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాడితే ప్రత్యేక హోదా వస్తుందని శివాజీ పేర్కొన్నారు. ఒకప్పుడు రాష్ట్రంలో పాలన బాగుందన్న వారు నేడు బాగోలేదని అంటున్నారని విమర్శించారు. శివాజీ జాగారానికి టీడీపీ నేతలు, పలు సంఘాలు సంఘీభావం తెలిపాయి.

Sivaji
Andhra Pradesh
Jagaram
Special Category Status
  • Loading...

More Telugu News