David Gudal: అన్నంత పనీ చేసిన ఆస్ట్రేలియా శాస్త్రవేత్త.. వైద్యుల సాయంతో స్వీయ మరణం!
- తాను ఇంకా బతికి ప్రయోజనం లేదన్న గుడాల్
- ప్రాణాంతక ఔషధం తీసుకుని తనువు చాలించిన శాస్త్రవేత్త
- వృక్ష, పర్యావరణ శాస్త్రవేత్తగా ఖ్యాతి
తాను ఇంకా బతికి ప్రయోజనం లేదని, చనిపోవాలని నిర్ణయించుకున్నానని చెప్పిన ఆస్ట్రేలియా శాస్త్రవేత్త డేవిడ్ గుడాల్ (104) ముందు చెప్పినట్టుగానే స్వీయ మరణం పొందారు. గురువారం వైద్యుల సాయంతో మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు. స్విట్జర్లాండ్, బేసెల్‌లోని లైఫ్ సర్కిల్ ఆసుపత్రిలో వైద్యుల సహకారంతో ప్రాణాంతక ఔషధం తీసుకుని తనువు చాలించారు. గుడాల్ ప్రతినిధి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఏప్రిల్ 1914లో లండన్‌లో జన్మించిన గుడాల్ ప్రముఖ వృక్ష, పర్యావరణ శాస్త్రవేత్తగా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించారు. మొదటి ప్రపంచయుద్ధ సమయంలో ఆస్ట్రేలియాకు వెళ్లిపోయిన గుడాల్ కుటుంబం అక్కడే స్థిరపడింది. అమెరికా, బ్రిటన్ దేశాల్లో వివిధ ఉన్నత పదవులు అధిష్ఠించిన గుడాల్ 1979లో రిటైరయ్యారు.