Tollywood: ‘నా పేరు సూర్య’కు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇది!: హీరో అల్లు అర్జున్

  • హైదరాబాద్ లో ‘నా పేరు సూర్య’ సక్సెస్ మీట్
  •  పవన్ కు, ఆయన ఫ్యాన్స్ కూ థ్యాంక్స్ చెప్పిన బన్నీ 
  • ఈ సినిమాను ఆదరించిన అందరికీ నా ధన్యవాదాలు

‘నా పేరు అల్లు అర్జున్.. నా ఇల్లు ఇండియా. ఈ ఫంక్షన్ పేరు థ్యాంక్యూ ఇండియా’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సక్సెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన అల్లు అర్జున్ మాట్లాడుతూ, ‘నేను చెప్పిన థ్యాంక్యూలో ఫస్ట్ థ్యాంక్యూ మా ముఖ్యఅతిథి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారికి. ఇక్కడికి వచ్చిన పవర్ స్టార్ అభిమానులు.. నా ఫ్యాన్స్ కి థ్యాంక్స్.

ఇక ఈ సినిమా గురించి నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏమిటంటే, ‘ఈ సినిమా చాలా బాగుంది. మా పిల్లలు మిలిటరీ యూనిఫామ్ కుట్టించుకుంటాం అంటున్నారు. మీరు ఈ సినిమా చేయడం వల్ల మా పిల్లలు అలా అడుగుతున్నారు’ అంటూ కొందరు మహిళా ప్రేక్షకులు చెప్పారు. ఈ సినిమాను ఆదరించిన అందరికీ నా ధన్యవాదాలు’ అని అన్నాడు.

కాగా, అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం సక్సెస్ మీట్ లో ‘మెగా’ బ్రదర్ నాగబాబు, దర్శకుడు వక్కంతం వంశీ, బన్నీ వాసు, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News