Karnataka: మా పార్టీ నేత యడ్యూరప్ప సీఎం కాబోతున్నారు!: అమిత్ షా ధీమా

  • కర్ణాటకలో బీజేపీకి ప్రజలు నీరాజనం పడుతున్నారు
  • యడ్యూరప్ప ముఖ్యమంత్రి కావడం ఖాయం
  • సిద్ధరామయ్య రెండు నియోజకవర్గాల్లో ఓడటం ఖాయం

కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి తమ పార్టీ నేత యడ్యూరప్పేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. నెలరోజులకు పైగా కర్ణాటకలోని అన్ని జిల్లాల్లో పర్యటించానని, ప్రతి జిల్లాలోనూ ప్రజలు బీజేపీకి నీరాజనాలు పలికారని బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు.

సిద్ధరామయ్య మరో నాలుగు రోజులు మాత్రమే సీఎం కుర్చీలో ఉంటారని, ఆ తర్వాత తమ పార్టీ నేత యడ్యూరప్ప సీఎంగా బాధ్యతలు చేపడతారని జోస్యం చెప్పారు. సీఎంగా యడ్యూరప్ప బాధ్యతలు చేపట్టాక కేంద్రం నుంచి కర్ణాటకకు ప్రత్యేక నిధులు కేటాయిస్తారని, దేశంలోనే కర్ణాటకను అన్ని విధాలుగా అభివృద్ధి పథంలోకి తీసుకెళతామని చెప్పుకొచ్చారు. రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న సిద్ధరామయ్య ఆ రెండింటిలో ఓటమిపాలు కావడం ఖాయమని అన్నారు.

Karnataka
bjp
amitsha
  • Loading...

More Telugu News