vasantha nageswar rao: తండ్రితో కలసి వైసీపీలో చేరిన వసంత కృష్ణప్రసాద్!

  • జగన్ సమక్షంలో తండ్రితో కలసి వైసీపీలో చేరిక
  • జగన్ సీఎం అవుతారన్న కృష్ణప్రసాద్‌
  • మరోసారి వైయస్ పాలన రావాలన్న వసంత నాగేశ్వరరావు

మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు, ఆయన కుమారుడు వసంత కృష్ణప్రసాద్ లు వైసీపీలో చేరారు. కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ సమక్షంలో వీరు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు వైసీపీలో చేరారు. వారందరికీ కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు జగన్.

ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, వైసీపీని బలోపేతం చేయడానికి జగన్ నాయకత్వంలో పని చేస్తామని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పారు. రాష్ట్రాన్ని జగన్ అభివృద్ధిపథంలోకి తీసుకెళతారన్న విశ్వాసం తనకుందని అన్నారు. వసంత నాగేశ్వరరావు మాట్లాడుతూ, మరోసారి వైయస్ పాలన తిరిగిరావాలన్న ఉద్దేశంతోనే వైసీపీలో చేరామని చెప్పారు. వైయస్ ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఉన్నాయని అన్నారు.

vasantha nageswar rao
vasantha krishna prasad
YSRCP
jagan
Telugudesam
  • Loading...

More Telugu News